Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పరిగి
మున్సిపల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని 15 వ వార్డు ప్రగతి హై స్కూల్ ఏరియాలో బోరు మోటర్ కాలిపోవడంతో వెంటనే మున్సిపల్ చైర్మెన్ అశోక్ కుమార్ మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి ఎద్దడి దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా అవసర నిమిత్తం వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ముకుంద శేఖర్, టీఆర్ఎస్ నాయకులు ముకుందం నరేష్, చంద్రశేఖర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.