Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్ సోమవారం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన సమీనాబేగం, నసీమ్బేగం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నారు. వారిద్దరికీ సీఎం సహాయ నిధి ద్వారా రూ.2,35,000 ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మంజూరు చేయించారు. లబ్దిదారులిద్దరికీ మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ..ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీిఎసీఎస్ వైస్ చైర్మెన్ భాస్కర్, కౌన్సిలర్లు వెంకటేష్, రవీంద్ర, టీఆర్ఎస్ నాయకులు రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.