Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కపాటి పాండురంగారెడ్డి
నవతెలంగాణ- కందుకూరు
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు మానుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కపాటి పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గోదావరి జలాలను సముద్రంలో కలిపారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరు అందిస్తున్నారన్నారు. వరి ధాన్యం పండించిన ఘనత మన రాష్ట్రానికే దక్కిం దన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణకు కావాల్సిన నిధులపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి, నిధులు తీసు కొచ్చారని గుర్తుచేశారు. మహేశ్వరం నియోజకవ ర్గంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ఇప్ప టికైనా ప్రభుత్వంపై విమర్శలుమాని నిజాలు తెలుసుకొ ని మాట్లాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మూల హనుమంత్‌రెడ్డి, రైతు సమ న్వయసమితి, రైతుబంధు అధ్యక్షులు గోపి రెడ్డి సత్యనా రాయణ రెడ్డి పాల్గొన్నారు.