Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
అఖిల భారతీయ కుమ్మర ప్రజాపతి కుంభకార్ మహాసంఫ్ు రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శివానంద్ ఆధ్వర్యంలో మండలం నందివనపర్తిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుంభకార్ స్వశక్తి కిరణ్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుంభకార స్వశక్తి శిక్షణ కార్యక్రమాన్ని కుమ్మర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆధునిక యంత్రాల ద్వారా మరింత నైపుణ్యాన్ని నేర్చుకుని స్వశక్తి పై నిలవాలని అన్నారు. శిక్షణ 10 రోజులు నిర్వహిస్తారని శిక్షణ అనంతరం యంత్రాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ శంకర్, ఉపాధ్యక్షులు బస్వాపురం దశరథ,జిల్లా యూత్ అధ్యక్షుడు కాకులారం హనుమంతు, రాష్ట్ర ఆర్గనైజర్ కే కే ఎస్ కిష్టమల్ల శివ శంకర్, ట్రైనర్ శంకరప్ప, నందివనపర్తి గ్రామస్తులు కొండాపురం శ్రీశైలం, దానయ్య, కుమ్మర కులస్తులు తదితరులు పాల్గొన్నారు.