Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ- కందుకూరు
గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా రూ. 20 లక్షలతో ఆ గ్రామ సర్పంచ్ యాలాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీసీరోడ్లు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణం కోసం అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో కందుకూరు మండలం అభివృద్ధి పథంలో ముందుకు సాగు తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కందు కూరు సహకార సంఘం చైర్మెన్ దేవరశెట్టి చంద్రశేఖర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురసాని సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ సురేష్, డైరెక్టర్ పొట్టి ఆనంద్, వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.