Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీపీవై రవీందర్ యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
ఎంచుకున్న వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేసినప్పుడే నిజమైన ఆనందం ఉంటుందని, ఎంపీడీిఓ వృత్తికి న్యాయం చేసి ఎంపీడీవో చంద్రకళ ఎంతో ఆనందాన్ని పొందారని ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరం ఆవరణలో ఎంపీడీవో చంద్రకళ స్వచ్ఛంద వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశానికి ఎంపీపీతోపాటు జడ్పీటీసీి తాండ్ర విశాల శ్రావణ్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తూ 35 ఏండ్లు ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఏడేండ్ల సర్వీస్ ఉన్నప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ఆమె వీఆర్ఎస్ పొందుతున్నారని తెలిపారు. ఆమె మండలానికి చేసిన సేవలను మరువలేమన్నారు. కార్యక్రమంలో కేశంపేట సర్పంచి తలసాని వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ అనురాధ పర్వత్ రెడ్డి, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంఈఓ మనోహర్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులతో పాటు తదితరులు పాల్గొన్నారు.