Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో సోమవారం ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లప్ప గుట్టకు వెళ్లే రహదారిపై నిర్మించిన ముఖద్వారంతో పాటు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, ఆలయ ముఖద్వారం, సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లా డుతూ సుమారు రూ.12 లక్షలు వెచ్చించి ఆలయా నికి ముఖద్వారం నిర్మించిన స్థానిక ఎంపీటీసీ, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం వందన శ్రీనివాస్ రెడ్డిలను అభినందించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ నిధుల నుంచి మంజూరైన రూ.75 లక్షలతో సీసీ రోడ్డును నిర్మించినట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్, పాండు రంగారెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండలాధ్యక్షులు దశరథ్ నాయక్, సర్పంచ్ కిష్టమ్మ, చెన్నారం సర్పంచ్ స్వప్న భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.