Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలుష్యం వలయంలో చుట్టు పక్కల గ్రామస్తులు
- డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపాలి:గ్రామస్తులు
నవతెలంగాణ-షాద్‌నగర్
షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఉన్న డంపింగ్ యార్డులో మళ్ళీ మంటలు వ్యాపిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రతి పదిహేను రోజులకోసారి, మంటలు వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు వాపో తున్నారు. రోడ్డు నుంచి వెళ్లే ప్రజలు కట్టుదిట్టమైన పొగ ఉండటంతో రోడ్డు దాటేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా శాశ్వత పరిష్కారం మార్గం చూపడం లేదు. చెత్తలో మంటలు చల్లార్చడానికి మున్సిపాలిటీ ట్యాంకర్లు తెచ్చి అప్ప టిమాత్రం చాల్లార్చి వెళ్తున్నారు. కానీ శాశ్వత పరి ష్కారం ఆలోచించడం లేదు. సోలిపూర్ గ్రామాస్తుల విన్నపం మేరకు బీఎస్పీ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే స్పందించి, డంపింగ్ యార్డును సందర్శించి, సమస్య పరిష్కారం
చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసినా, ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. డంపింగ్ యార్డు పక్కల ఉన్న సోలిపూర్, సోలిపూర్తండా ప్రజలకు శ్వాసకోశ వ్యాధ్యులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయనే భయాందోళనకు గురవు తున్నారు. ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులు తమ గోడును వెళ్లబోసుకుందామన్నా కానరారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలనీ, లేనియేడల రానున్న రోజుల్లో రెండు గ్రామాల ప్రజలు అనేక అనారోగ్యాలపాలయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వతంగా పరిష్కరించాలి
డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం దిశగా షాద్ నగర్ మున్సిపాలిటీ అధికారులు ఆలోచించాలి. లేనియేడల రానున్న ఎన్నికలలో నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. సోలిపూర్, సోలిపూర్తండా ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకముందే మంటలు ఆర్పీ పొగ నుంచి రెండు గ్రామాలను కాపాడాలి. డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలి.
సింగపాగ జంగయ్య
ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు