Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానోపాధ్యాయురాలు బైరు లావణ్య కొండల్ రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
సాంకేతిక విద్య, నైపుణ్యాల అభివృద్ధి, సైన్సు పరంగా సాధించాలని నోబుల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బైరు లావణ్య కొండల్ రెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల కేంద్రంలో నోబుల్ హైస్కూ ల్లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో సైన్సు లేని జీవితాన్ని ఊహించలేం అన్నారు. సైన్స్ అనేది ఈ ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు. భారత శాస్త్రవేత్త సీవీ రామన్ 1928, ఫిబ్రవరి 26న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. 1987 నుండి ఫిబ్రవరి 28 నా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. సైన్స్ పరంగా విద్యార్థులు ప్రగతి సాధించాలని కోరారు. వైజ్ఞానిక ప్రదర్శనలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నగా 50 మంది విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు డైరెక్టర్ బైరు చిలకమ్మా, రామ్ రెడ్డి దంపతులు, పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎస్. కుమార్, లయన్స్ క్లబ్ మహేందర్ కుమార్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.