Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారుల ఆవిష్కరణ అద్భుతం..
- వైస్ ఎంపీపీ మధులత
నవతెలంగాణ-పెద్దేముల్
మానవుడే మహనీయుడు సైన్స్ ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఫలితమేనని నేడు మనం అనుభవస్తున్న విలాసవంతమైన జీవన ప్రయాణమని పెద్దేముల్ మండల్ వైస్ ఎంపీపీ మధులత అన్నారు. సోమవారం పెద్దేముల్ మండల పరిధిలోని పెద్దేముల్, మంబాపూర్, కందనేల్లి, ఇందూర్, మారేపల్లి, తట్టేపల్లి, అడ్కిచర్ల వివిధ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ నమూనాలను పెద్దేముల్ సర్పంచ్ విజయమ్మ, కందనేల్లి సర్పంచ్ మోహన్ రెడ్డి, మండల విద్యాధికారి వెంకటయ్య, పీఆర్టీయూ మండల ప్రధాన కార్య దర్శి నవీన్ కుమార్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శాంతప్ప, మల్లమ్మ, రాములు, శ్రీనివాస్, అక్కమాదేవి, శ్రీనివాస్‌లతో కలిసి పరిశీ లించి విద్యార్థులను అభినందించారు.అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు కలలు కనడమే కాదనీ, వాటిని సాకారం చేసికున్నప్పుడే అను కున్నది సాధిస్తారని అన్నారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభ వెలికి తీసేందుకు సైన్స్ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. చంద్రశేఖర్ వెంకట్ రామన్ భారతదేశంలో జన్మించి సైన్స్‌లో అంత ర్జాతీయ ఖ్యాతిని సంపాదించడం గర్వకారణమని కొనియాడారు. కార్యక్ర మంలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వజీర్, శ్రీకాంత్, మంగ, అనూష, రాధా, మనీ పాఠశాలలో చైర్మెన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు.