Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్ నగర్
ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గంట్ల వెళ్లి గ్రామంలో బూర్గుల సెక్టార్ అధ్యక్షులు చారకొండ నర్సింలు ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం రాత్రి బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డి శ్రీనివాస్, మండల కన్వీనర్ సుదర్శన్ ముఖ్య అతిథులుగా పాల్గొని కమిటీని నియమించారు.గ్రామ కమిటీ కన్వీనర్‌గా కర్రోళ్ల శివ కుమార్, కో కన్వీనర్లుగా ఎర్రోళ్ల రాజు, మిద్దె వెంకటేష్, కమిటీ సభ్యులుగా ఎర్రోళ్ల బాలరాజ్, తిర్లపురం నరసింహా, చారగొండ శ్రీనివాస్, రామ స్వామి, బాదేపల్లి యాదయ్య, ప్రశాంత్‌లను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. అనంతరం బూత్ కమిటీని నియమించారు. బూత్ కమిటీ అధ్యక్షుడిగా మిద్దె కృష్ణ, ఉపాధ్యక్షులుగా మిద్దె రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లుగా నందారం లింగం, గంజాయి ప్రకాష్ , నరసింహాలను ఎన్నుకున్నారు.