Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
పట్టణంలో ఆమనగల్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో టైలర్స్డే వేడుకలను సోమ వారం ఘనంగా జరుపుకున్నా రు. ఈ సందర్భంగా కుట్టు మిష ను కనుగొన్న శాస్త్రవేత్త విలియమ్స్ హౌవే చిత్ర పటానికి టైలర్ సోదరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాపిశెట్టి రాము, డాక్టర్ పత్యనాయక్ తదితరులు హాజరై అసోసియేషన్ సభ్యులతో కలిసి మాట్లాడారు. కుట్టుమిషను సృష్టి కర్త విలియమ్స్ హౌవే పుట్టినరోజును పురస్క రించుకొని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న టైలర్సడే వేడుకలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియ ర్ టైలర్ రాములును సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు చాత సాయిబాబా, పున్న శ్రీను, యాదగిరి, నర్సింహ, సుధాకర్, సాయి, గంజి శ్రీను, భిక్షపతి, నర్సోజి, రాజు, నిర్మల, శారదా, మంగ, బుజ్జి, కృష్ణమ్మ పాల్గొన్నారు.