Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెేపీపీయస్ జిల్లా అధ్యక్షులు సోమారపు రవి
నవతెలంగాణ-మోమిన్‌పేట
దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని కెేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సోమవారం రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తహసీిల్దార్ కార్యాలయ ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ దళితబంధు అమలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేసి గ్రామస్తుల తీర్మానం మేరకు అర్హులను గుర్తించాలన్నారు. అర్హులను గుర్తించేందుకు కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, తహసీల్దార్‌కు అధికారాలు ఇవ్వాలన్నారు. అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలమైన వ్యక్తులకు దళితబంధు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. అనంతరం ఉప తహసీల్దార్ రవీందర్ దత్తుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు రాజు, లక్ష్మణ్, మొగులయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.