Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి పామెన బీంభారత్
నవతెలంగాణ-షాబాద్
ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా ఉంటామని కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి పామెన బీంభారత్ అన్నారు. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ మొగిలిగిద్ద పైలమ్మ ఆనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం ఆమె కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరమార్శించి, ఆర్థిక సాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ... కష్ట కాలంలో ఉన్న నిరుపేదలు, దళితులకు తాము అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ తరపున పేదలను ఆదుకు నేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా ప్రదానకార్యదర్శి భార్గవరాం, నాయకులు బండి ప్రభాకర్, నరేందర్, బందయ్య, నర్సింహులు, తదితరులు ఉన్నారు.