Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సర్పంచ్ కొనింటి సురేష్
నవతెలంగాణ- మోమిన్‌పేట
మండల పరిధిలోని చిన్న కోల్కుంద గ్రామంలో గుట్టపై రామేశ్వరం ఆలయంలో తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్య క్షులు, సర్పంచ్ కొనింటి సురేష్, ఉప సర్పంచ్ యాదయ్యలు కలిసి రూ.30 వేలతో రెండు చిన్న నీటి ట్యాంకులను నిర్మించారు. ఈ ఆలయానికి దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. పండుగ సమయాల్లో ఇతర గ్రామాల నుంచి భక్తులు వస్తుంటారు. కొనేండ్లుగా పండుగ సమ యాల్లో భక్తుల దాహార్తికి, మరే ఇతర అవసరాలు, పూజా కార్యక్రమాలకు నీరు కావాలన్నా గుట్ట దిగి గ్రామంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని భక్తులు, గ్రామ స్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను అభినందించారు. ఈ కార్య క్రమంలో సంగన్న పటేల్, మల్లప్ప, రాజు, శివ కుమార్, రాచప్ప, బక్కన్న, శేఖర్, స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.