Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాబాద్ ఆదర్శపాఠశాల(కళాశాల) ప్రిన్స్‌పాల్ శ్రీవాచ్యా
నవతెలంగాణ-షాబాద్
విజ్ఞాన ప్రదర్శనలతోనే విద్యార్థుల మేధస్సు పెంపొందుతుందని షాబాద్ ఆదర్శ పాఠశాల (కళాశాల) ప్రిన్స్‌పాల్ శ్రీవాఛ్యా అన్నారు. షాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశా లలో సోమ వారం పాఠశాల విద్యాకమిటీ చైర్మెన్ శ్రీనివాస్, వైస్ చైర్మెన్ దీపికలతో కలిసి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు చేసిన వివిధ సైన్స్ ప్రయోగాలను పరిశీలించి, వాటి ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు సైతం అన్ని రంగాల్లోనూ తీసిపోకుండా ముందుకు వస్తున్నారన్నారు. విద్యార్థు ల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీస,ి ఆసక్తిని బట్టి వారు ఎంచుకున్న రంగంలో రాణించేలా ఆదర్శ పాఠశాలలో అన్ని రకాలుగా శిక్షణలు ఇస్తున్నట్టు తెలిపారు. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా ముందుకువెళ్తు, మానవాళికి అనుకూలంగా, అవస రంగా ఉండే విధానాలను తీసుకురావడంలో విద్యా ర్థులు ప్రయోగాలు చేయాల్సిన అవసరముందన్నారు. విధ్వసంకన్న, విలువైన ప్రకృతి వనరులను కాపాడు కునే విధానాలు నేడు మానవాళికి అవసరమన్నారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి దేశం అన్నిరం గాల్లో దూసు కు పోవడానికి మానవుడు సాధించిన పరిశోధనల ఫలితమే విజ్ఞానమన్నారు. మానవుడి బుద్దివికాసానికి పెంపొందించేది విజ్ఞాన శాస్త్ర మన్నారు. విద్యార్థి దశనుండే విజ్ఞానంపై విద్యార్థులు పట్టుసాధించా లన్నారు. భారతీయ భౌతికశాస్త్రవేత్త సీవీ రమన్ సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుని విద్యా ర్థులు విజ్ఞానంలో ముందుండాలన్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి రూ.5లక్షలు మంజూరు చేయి స్తానన్నారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్స్‌పాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రమేష్, రాఘవేందర్, రబియా, జ్యోతి, మురళి, హరీష్, మహేందర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.