Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్య నారాయణ
నవతెలంగాణ-కొత్తూరు
యువత స్వయం ఉపాధి పొందుటకు ముందుకు రావాలనీ, అందుకు బ్యాంకర్లు వారికి తగిన సహకారం అందించాలి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని కేబీఎస్ బ్యాంక్ 21వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ.. ఖాతాదారులు బ్యాంకులకు ఆయువుపట్టు అని అన్నారు. బ్యాంకర్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై ప్రత్యేక దృష్టి సారించి, సేవింగ్ ఖాతాల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. బ్యాంకు సేవలు అందని మారుమూల గ్రామల ప్రజలకు సేవలు అందించి, దినదిన అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్, కౌన్సిలర్ మాదారం నరసింహాగౌడ్, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.