Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని సర్పంచ్
- అటువైపు తొంగి చూడని అధికారులు
- హైదరాబాద్ నుంచి చుట్టపు చూపుగా సర్పంచ్
- సమస్యల వలయంలో చెట్ల గుట్టతండా
- ఎండుతున్న పల్లె ప్రకృతి వనం
నవతెలంగాణ-మాడ్గుల
పల్లెలను పట్టుసీమలుగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తుంది.కానీ కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో క్షేత్రస్థాయిలో అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్న లక్ష్యం నీరుగారుతోంది. మాడుగుల మండలంలోని అన్ని గ్రామ పంచాయ తీల్లో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు మెరుగ్గానే జరుగుతున్నప్పటికీ నర్సంపల్లి గ్రామ పంచాయతీలో మాత్రం అభివృద్ధి అంతంత మాత్రమే కని పిస్తోంది. మారుమూల గ్రామం ఇక్కడికి ఎవరు వచ్చి అడుగుతారు లే అనుకుంటారో ఏమో తెలియదు కానీ నర్సంపల్లితో పాటు దాని అనుబంధ గ్రామం చెట ్లగుట్టతండా అధ్వానంగా మారింది. పంచాయతీ కార్య దర్శులు తరచు మారుతూ ఉండటం ఒక భాగమైతే గ్రామ సర్పంచ్ అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్య. సర్పంచ్ హైదరాబాదులో నివాసం ఉంటూ అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడు. కార్యదర్శులు మాత్రమే ప్రతిరోజూ అందుబాటులో ఉంటూ పనులు చేయిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే నర్సంపల్లిలో అపరిశుభ్రమైన రోడ్లు, ఊరు మధ్యలో ప్రాథమిక పాఠశాల,అంగన్వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న రోడ్డు అంచున ప్రమాదకరంగా పాడుబడ్డ బావి ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఎస్సీ కాలనీలో ఆదరబాదరగా సీసీ రోడ్లు వేసినప్పటికీ డ్రయినేజీ వ్యవస్థ లేక పోవడంతో ఎక్కడిక్కడే మురుగు నీరు నిలిచి దుర్ఘంధంతో పాటు దోమల నివాసంగా మారుతోంది. ప్రల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఎండిపోయి, మొక్కల మాను మాత్రమే కనిపిస్తున్నాయి.
చెట్లగుట్టతండాలో గంపెడు సమస్యలు
స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచిపోతున్నా కొంతమంది స్వార్ధ నాయకుల నిర్లక్ష్యంతో ప్రజలు కనీస అవసరాలకు నోచుకోవడం లేదు. 'ఒడ్డుదాటక ముందు ఓడమల్లన్న ఒడ్డు దాటాక బోడమల్లన్న' అన్న చందంగా ఉంది పాలకుల తీరు.
నర్సంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెట్ల గుట్టతండా సమస్యల పుట్టగా దర్శనమిస్తూ, ప్రజా సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గడిచిన మూడేం డ్లుగా వీధుల్లో సీసీ రోడ్లు,డ్రయినేజీ వ్యవస్థ లేదు. ఉన్న ఒక్క మురగు కాల్వ ఎప్పటికప్పుడూ శుభ్రం చేయక పోవడంతో ఆ కాల్వ నిండా చెత్తాచెదారంమే. గ్రామంలోని కొన్ని వీధుల్లో వీధిలైట్లు లేవు. ఉన్న కొన్ని వీధిలైట్లు బందు చేసే నాథుడే లేడని పలువురు విమర్శిస్తున్నారు.
నీటి సమస్య : వారానికొకసారి స్నానం చేస్తున్నామనీ, బట్టలు ఉతకడానికి నీళ్లు రావడం లేదని మహిళలు ఆందోళన చెందుతున్నారు. బోరుమోటర్ కాలిపోయి చాలా రోజులు గడుస్తున్నా, మరమ్మతులు చేయించడం లేదని గ్రామస్తులు దుయ్యబడుతున్నారు. తాగునీటి పైప్ లీకేజీతో నీరు కలుషుతమవుతోందని గ్రామస్తులు చెబు తున్నారు. సర్పంచ్ ఎప్పుడూ తండాకు రాడు. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా సమస్య అడిగితే 'మీరు నాకు ఓట్లు వేయలేదు నేనూ ఏ పని చేయ్యను' అని దురుసుగా మాట్లాడుతాడని తండావాసులు వాపోతున్నారు.
మోటర్ మరమ్మతులు చేయాలి
తండాలో బోరు మోటర్ కాలిపోయి చాలా రోజులు అవుతుంది. నీరందక అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నాం. వీధులన్నీ చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా ఉంటాయి. రోడ్ల మీద మట్టి ఎప్పుడు పోయలేదు. వీధిలైట్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉన్నా, ఎవరు పట్టించుకోరు. ఇప్పటికైనా తండాను పట్టించుకోని సమస్యలు పరిష్కరించాలి.
- నేనావత్ జానూ , చెట్లగుట్టతండా
నీరు రాకా నానా అవస్థలు పడుతున్నాం. స్నానం చేయడానికి బట్టలు ఉత్తుకోవడానికి ఇబ్బందులు పడు తున్నాం. బోరు మోటర్ కాలిపోయింది బాగు చేయించాలి. మా తండాకు ఎవ్వరూ రారు. మా తండా సమస్యలు పట్టించుకోరు. ఓట్లప్పుడు అభివృద్ధి చేస్తా మంటారు కానీ, గెలిచినంక అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ తండా సమస్యలు పరిష్కరించాలి.
- కమలమ్మ, చెట్లగుట్టతండా
ప్రమాదకరంగా ఉన్న బావిని పూడ్చాలి
ఊరి మధ్యలో రోడ్డు అంచుకు బావి ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వ స్కూల్ ,అంగన్ బడి ఎదురుగా ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నీళ్లు కూడా ఉన్నాయి చెత్తాచెదారం అందులో వేయడంతో విష పురుగులకు ఆవాసంతో పాటు ఈగలు దోమలు పెరుగుతున్నాయి.
- పధిర కొండల్ రెడ్డి, నర్సంపల్లి
సర్పంచ్ ఒక్క పని కూడా చేయలే ..
సర్పంచ్ మా తండాకు ఎప్పుడు రాడు. ఒక్క పని కూడా చేయలేదు. తాగే నీళ్ల పైపు లీకేజీతో నీరు కలుషితమై రోగాల భారీన పడుతున్నాం.తండాలో రోడ్లు ఎవ్వరూ ఊడ్చరు. చెత్తబండి కూడా ఎప్పుడు రాదు. మురుగు కాలువ నిండా చెత్త నిండిపోయింది. వీధుల్లో మురుగునీరు నిలుస్తుంది. అండర్ డ్రయినేజీ, సీసీ రోడ్లు వేయాలి.
- నేనావత్ మిటియా , చెట్లగుట్టతండా
ప్రజలకు అందుబాటులో ఉంటున్న కార్యదర్శి
నర్సంపల్లి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి నిత్యం అందు బాటులో ఉంటున్నారు. రెగ్యులర్ కార్యదర్శి ప్రశాంతి లాంగ్ లీవ్‌లో ఉండటంతో ఇన్చార్జిగా పలుగు తండా సెక్రెటరీ మహేష్ బాధ్యతలు నిర్వహి స్తున్నారు. పల్లె ప్రకృతి వనం భూమి మొక్కల పెరుగుదలకు అనువుగా లేకపోవడంతో పెర గడం లేదు. కొంత ఇబ్బందిగా ఉంది. చెట్లకు పాదులు తీయించి నీళ్లుపెడుతున్నాం.
- మండల పంచాయతీ అధికారి వేజన్న