Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల పని విధానం పెరగాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ-మంచాల
ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయా లని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని క్రిష్ణమూర్తి భవన్లో పార్టీ మండల కమిటీ శాఖ కార్యదర్శిల, ఆగ్జలరీ శాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ పార్టీ అభివృద్ధి చెందాలంటే ఎప్పటికప్పుడూ శాఖ సమావేశాలు క్రమం తప్పకుండా జరగా లన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియ జేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు గుర్తించి, ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రజా సంఘాల పని పెరిగినప్పుడే పార్టీ అభివృద్ధి ఉంటోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, మండల కార్యదర్శి నాగిల్ల శ్యాం సుందర్, జిల్లా నాయ కులు కే.శ్రీనివాస్ రెడ్డి, ఆర్.జంగయ్య, మండల కమిటీ సభ్యులు మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌నాయక్, పి.గోపాల్, జపాల్ ఎంపీటీసీ లట్టుపల్లి చంద్ర శేఖర్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు వెంకటేశ్, యాదయ్య, జంగయ్య, లేనిన్, కే జగదీశ్, కే. బుచ్చయ్య, డి.మమత అజరుబాస్, ఆర్ స్వామి. ఎం ఫయాస్, సువర్ణ, వివిధ గ్రామాల కమిటీ సభ్యులు , కార్యదర్శులు, తదితరులున్నారు.