Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి అంజయ్య
ఎంపీడీవోకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-యాచారం
ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాండ్ల అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు, కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవో విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మండల పరిధిలోని మోగుల్లవంపులో ఉపాధిహామీ కూలీలను కలిసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పనిగంటలు తగ్గించి, రోజుకు రూ.600 రూపాయలు చెల్లించాలన్నారు. ఆ గ్రామంలో ఉపాధి హామీ కూలీల సంఘం ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరానికి ఉపాధి హామీ ద్వారా 200 రోజులు పని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉడుతల జంగయ్య, సత్తయ్య, చంద్రయ్య, శేఖర్ పాల్గొన్నారు.