Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కాలనీల అభివృద్ధికి కాలనీవాసులు భాగ స్వాములు కావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ ప్రభు పాద లే ఔట్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై కాలనీలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం పాదయాత్ర చేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ సమస్యల పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. అదే విధంగా ప్రభు పాద లే ఔట్ కాలనీలో డ్రయినేజీ, ఔట్ లెట్ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మురుగు నీటి సమస్యకు శాశ్వ త పరిష్కారం చేస్తామని హామీనిచ్చారు. కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి, స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ిక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించా మన్నారు. మరికొన్ని సమస్యలు తాగునీరు, రోడ్లు, విధీ దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత పనులు నిర్వహించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ,అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా నని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సందీప్ ,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రభు పాద లే ఔట్ కాలనీ వాసులు సుధాకర్, వేణు ,రామేశ్వర్ రావు, శ్రీకాంత్, భువన్,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.