Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ రవీందర్ యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
తాను పుట్టిన తన ఊరికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలని టీఆర్ఎస్ షాద్నగర్ నియోజక వర్గం సీనియర్ నాయకులు కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని గూడూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ బ్యాగరి సత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాగత ముఖ ద్వారాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామానికి ఇరువైపులా రెండు ముఖ ద్వారాలు నిర్మించేందుకు వచ్చిన దాతలు సయ్యద్ సర్దార్, అతని కుమారులు, మరోవైపు కుమ్మరి సత్తయ్య, అతని కుమారులు ముందుకు వచ్చినట్టు అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీం దర్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామాబి óవృద్ధికి తమవంతుగా సహకరించడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనం తరం శివాలయం నిర్మాణానికి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల్ పరిషత్ అధ్యక్షులు పిన్నింటి మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్, మల్లాపూర్తండా సర్పంచ్ రవి నాయక్, మక్త గూడెం సర్పంచ్ కట్నా రాజు, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేందర్ గౌడ్, చేగూర్ పిఎసిఎస్ చైర్మెన్ అశోక్, వైస్ చైర్మెన్ పద్మారావు, నాయకులు చిర్ర మధుసూదన రావు, మైస గళ్ళ రమేష్, పాత్ లవత్ లక్ష్మణ్ నాయక్, నేనావత్ గోపాల్ నాయక్, మోడీ దర్శనం, బి శ్రీ రాములు, దయ్యాల పాండు తదితరులు పాల్గొన్నారు.