Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాన్యుల సమస్యలకు పరిష్కారం కరువు
- అధికార పార్టీ నేతలకే సేవలు
- ఎమ్మెల్యే, ఎంపీ స్ధాయి వ్యక్తులకే ప్రాధాన్యత
- ధరణి పోర్టల్‌తో సామాన్యుడికి తిప్పలు
- కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు
పట్టించుకొని ఉన్నతాధికారులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి అధికార పార్టీ నేతలకు అందలం వేస్తున్నారు. సామాన్య ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా అధికార పార్టీ నేతలకు మాత్రమే వత్తాసు పలుకుతున్నారు. కలెక్టరేట్లో పేదల దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పడి ఉంటే.. అధికార పార్టీ నేతలు మాత్రం తమ పనులను చిటికెలో చేయించుకుంటు న్నారు. ముఖ్యంగా ధరణి పోర్టల్‌తో సామాన్యుడి కష్టాలు రెట్టింపు అయ్యాయి. కానీ భూస్వాములకు, పెట్టుబడుదారు లకు, రియల్ఎస్టేట్, అధికార పార్టీ నాయకులకు ధరణితో భూ సమస్యల పరిష్కారం సులభతరమైయ్యాయి. సామాన్యులకు సాకులు చెబుతున్నా అధికారులు.. అధికారు ల పార్టీ నేతలకు మాత్రం దగ్గరుండి సమస్యలు పరిష్కారి స్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులకు మాత్రమే గులాం గిరి చేయడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతం కావడంతో జిల్లాలో భూములకు భóలే డిమాండ్ ఉంది. అంతే స్థాయిలో భూ సమస్యలు కూడా ఉన్నాయి. భూ సమస్యలు పరిష్కారించడంలో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా నెంబర్ వన్ స్థానంలో నిలిచినప్పటికీ.. అంతే స్థాయిలో సమస్యలు పెరుకుపోయినట్టు తెలుస్తోంది. మరో 20 వేల పెండింగ్ దరఖాస్తులు మాత్రమే వివిధ కారణా లతో పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భూ సమస్యలు కుప్పలు తెప్పలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లాలో భూ సమస్యల పరిష్కారం అస్థవస్తంగా ఉంది. ఇక్కడ అంత పైరవీకారులదే హవా నడుస్తోంది. సామాన్యుడి సమస్య పరిష్కారం అంత సులభమైన పనికాదు అన్నట్టు ధరణి పోర్టల్ పనితీరు ఉంది. సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అధికారులే వక్రమార్గం లో పయనిస్తే... వారి సమస్యలు పరిష్కరించేది ఏవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్షేత్రస్ధాయిలో పనిచేసే మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో జిల్లా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేద్దామంటే ప్రజల అవస్థలు వినే నాథుడే లేకపోవడం గమానర్హం.
ఈ ధరణికి పరిష్కారమేదీ..?
దాదాపు ఆన్లైన్ దరఖాస్తులను పూర్తి చేశామని కలెక్టర్లు చెబుతున్నప్పటికీ.. వాటిలో ఎక్కువగా ఎటువంటి కారణం చూపించకుండా తిరస్కరించారని దరఖాస్తుదారు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఈసేవా కేంద్రాలకు వెళ్లి డబ్బులు చెల్లించాల్సి వస్తోందంటున్నారు. ఇదే తరహా సమస్యలపై హైదరాబాద్, ఇతర ప్రాంతాల వ్యక్తులు వస్తే క్షణాల్లో పరిష్కారమవుతున్నాయని, పేదలంటేనే పనులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఓ ఉన్నతాధికారి సహాయకుడిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ప్రతి పనికి లెక్కగట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని రెవెన్యూ సిబ్బందే పేర్కొనడం గమనార్హం. రాజకీయ నాయకుల పనులను దగ్గరుండి చక్కదిద్దుతు న్నారని సమాచారం. సమస్యల పరిష్కారానికి సామాన్యులు కలెక్టర్ ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కలెక్టరేట్‌కు వెళ్లి ఆ నియోజకవర్గానికి చెందిన 30 ఫైళ్లను క్లియర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యేలకు రెవెన్యూ సమస్యలు మొర పెట్టుకుంటేనే పరిష్కారమైతా యని ప్రచారం జరుగుతుంది. కొంత మంది తహాశీల్ధార్లు స్ధానిక ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్లకు ఏలాంటి ధ్రువీకరణ పత్రాలైనా ఇస్తున్నారు. దీంతో భూ మార్పిడి, సక్సెసేషన్లు చేయించుకుంటున్నారు. అధికారులు జారీ చేసే పత్రాలతో అర్హులైన పేదలకు ఆన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి అక్రమ రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుందని క్షేత్రస్థాయిలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.