Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇమ్యునోథెరఫీతో చికిత్స
- విజయం సాధించడంలో
తోడ్పడిన డాక్టర్ జమాల్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎంతో మంది జీవితాలకు డెండ్రిటిక్ సెల్ ఆధారిత ఇమ్యునోథెరఫీ చికిత్సతో వెలు గును అందించిన సుప్రసిద్ధులు డాక్టర్ జమాల్ ఏ ఖాన్. ఆయన చికిత్సా విధానాలు కేవలం క్యాన్సర్ రోగుల జీవిత నాణ్యత మెరుగుపరచడమే కాదు, తొలి దశ క్యాన్సర్లతో పోరాడుతున్న వారిలో సర్వైవల్ రేట్‌ను సై తం గణనీ యంగా పెంచగలిగారు. ఇప్పటి వరకూ డాక్టర్ ఖాన్ చికిత్స కారణంగా దేశీయంగానే కాక విదేశాలలో సైతం ఎంతో మంది ప్రాణాంతిక వ్యాధి బారి నుంచి బయటప డగలిగారు. ఆయన విజయవంతమైన చికిత్సా విధానానికి మరో ఉదాహరణగా సైమా నిలుస్తుంది.
బులంద్‌షహర్‌కు చెందిన లిఫ్తికార్ అహ్మద్ కుమార్తె సైమా. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె, సరైన సమ యంలో డాక్టర్ ఖాన్‌ను సంప్రదించడంతో పాటుగా తీవ్ర మైన బ్రెయిన్ క్యాన్సర్ బారి నుంచి బయటపడగ లిగారు. తీవ్రమైన తలనొప్పి, కంటి చూపు మందగించడం వంటి అనేక సమస్యలతో ఆమె, తండ్రితో కలిసి ఎన్నో హాస్పిటల్స్ కు తిరిగారు కానీ తగిన చికిత్సను మాత్రం పొందలేకపో యారు. అదృష్టవశాత్తు ఆమె డాక్టర్ జమాల్ డెన్వాక్స్ క్లీనిక్స్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లో సంప్రదించారు. డాక్టర్ ఖాన్ తన బృందంతో కలిసి పూర్తి చికిత్సను అందించడంతో పాటుగా 8నుంచి 9 నెలల్లో పూర్తిగా నయం చేయగలిగారు. ఇప్పుడు ఆమె తన పనులను తాను సొంతంగా చేసుకోగలుగుతున్నారు.
ఆమెకు అందించిన చికిత్స గురించి డాక్టర్ జమాల్ ఏ ఖాన్ మాట్లాడుతూ 'నేడు ప్రపంచవ్యా ప్తంగా లక్షలాది మందికి డెండ్రిటిక్ సెల్ ఆధారిత ఇమ్యునోథెరఫీతో విజయవంతంగా చికిత్సనందిస్తున్నారు. మేము కూడా అదే తరహా చికిత్సనందించడంతో పాటుగా తమ ఇమ్యునోథెరఫీని సైతం అందించి బ్రెయిన్ క్యాన్సర్‌పై విజయం సాధించడంలో తోడ్పడ్డాం. ఈ తరహా చికిత్సలో మేము రోగి రక్తం నుంచి తెల్లరక్త కణాలను తీసుకుని ఈ డెండ్రిటిక్ కణాలను ల్యాబ్‌లో సృష్టించాం. అనంతరం వాటిని రోగి శరీరంలో ప్రవేశ పెట్టాం. ముందుగానే క్యాన్స ర్లను గుర్తించడం ద్వారా విజయవంతంగా చికిత్సనందిం చడమూ వీలవతుంది ' అని అన్నారు.