Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీ కార్మికుడిగా పనిచేస్తూ మరణించాడు
- 25 ఏండ్లు ప్రజలకు సేవలందించాడు
- ఆయన మృతితో రోడ్డున పడ్డాం
- ఉద్యోగం కోసం పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేదు
- కలెక్టర్ సారైనా నా గోస చూసి ఉద్యోగం ఇవ్వాలి : బాధితురాలు అంకిల్ల అక్ష్మమ్మ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
' నా భర్త 25ఏండ్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్మికుడిగా చేశాడు. ఇటీవల విధుల్లోనే మరణించాడు. జీవో ప్రకారం నా భర్త ఉద్యోగం నాకు రావాల్సి ఉంది. కానీ నాకు ఇవ్వాల్సిన ఉద్యోగం ఇతరులకు ఇచ్చిన నన్ను మాత్రం డైలీ వర్కర్‌గా పనిచేయిస్తున్నారు.' అని ఇబ్రహీంపట్నం మండలం ఖానాపురం గ్రామానికి చెందిన బాధితురాలు అంకిల్ల అక్ష్మమ్మ తన గోడు వెల్లబోసుకుంది. సోమవారం కలెక్టర్‌కు తన బాధను చెప్పుకోవడానికి వచ్చిం ది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త ఉద్యో గం తన ఇవ్వాలని రోజుల తర బడి ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తన భర్త మరణిం చడంతో తన రెక్కల కష్టంతోనే కుటుంబాన్ని నడిపించాల్సి వస్తోంది. తన భర్త మృతితో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు అమ్మా యిలు, ఒక అబ్బాయి ఉన్నాడని తెలిపారు. డైలీ కూలి పని చేస్తు పిల్లలను సాకడం కష్టంగా ఉందన్నారు. 25 ఏండ్లుగా తన భర్తతో చాలీచాలని జీతానికే పనిచేయిం చుకున్న ప్రభుత్వం.. భర్త చనిపోతే ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కనీసం ఇన్నాళ్లు పనిచేసిన పీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. కనీసం తన భర్త ఉద్యోగానైనా తనకు ఇప్పిస్తే బాగుంటుందని కోరారు.