Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
పద ముద్రాలలో మెలకువలు, అభినయ ప్రధానమైన అంశాలలో వ్యక్తీకరణలో స్పష్టత సింధూరి నాట్య ప్రదర్శనలో ప్రేక్షకులను ఆకటు ్టకున్నాయి. ప్రఖ్యాత కూచిపూడి నాట్య గురువు భాగవతుల సేతురాం శిష్యురాలు సింధూరి నాయుడు కూచిపూడి నృత్య రంగ ప్రవేశం రవీంద్రభారతి ప్రధాన వేదికపై సోమవారం శ్రీ కూచిపూడి నృత్య నిలయం సంస్థ నిర్వహణలో జరిగింది. తొలి అంశంగా సింధూరి గణపతి స్తుతితో నాట్యం ఆరంభించి నర్తనం ప్రధాన మైన తరంగం అంశంలో హస్త పద ముద్రాలలో పరిణతి కనపరిచారు. అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలలో ఆమె కనపరచిన అభినయంతో ప్రేక్ష కుల ప్రశంసా పొందారు. నట్టువాంగం గురువు సేతురాం చేయగా మంతా శ్రీనివాస్ గానం శ్రావ్యమై ఆకట్టుకొంది. వాయులీనం పై కొలంక అనిల్ కుమార్, మృదంగంపై నాగేశ్వరరావు, వేణువుపై ఉమా వెంకటేశ్వర్లు సహకరించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిóగా శాసన సభ్యుడు చందర్ పాల్గొని నర ్తకిని సత్కరించారు. నటి సబిత, నాట్య గురువు హరితేజలు గురువు సేతురాం, నర్తకి సింధూరి ప్రతిభను ప్రశంసించారు. పోలీస్ అధికారి భిక్షాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.