Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ మోతిలాల్
నవతెలంగాణ-పరిగి
ఉన్నతి పథకం ద్వారా ఉచిత శిక్షణను సద్వినియో గం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ అన్నారు. సోమవారం పరిగి పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పరిగి నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన మహిళలకు ఉన్నతి పథకంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మోతీలాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కృష్ణన్ మాట్లాడుతూ ఉన్నతి పథకం 2018-19 సంవత్సరంలో పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్ల మం డలాలలో గ్రామీణ ప్రాంతాలలోని ఉపాధి హామీలో 100 రోజుల పని పూర్తి చేసుకున్న కుటుంబాలలోని 10వ తరగతి ఉత్తీర్ణత అయిన వారికి, 18 నుంచి 45 ఏండ్ల మధ్య గల నిరుద్యోగులకు ఉన్నతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించుట ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా పేద కుటుంబాలు ఆర్థిక స్వావలంబన పొందేలా ఉన్నతి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మగ్గం వర్క్, ఆర్టిఫిషియల్ జువెలరీస్ తయారీపై శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కాలం పూర్తి అయిన తర్వాత అభ్య ర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వారు స్వయం ఉపాధి కూడా పొందవచ్చని తెలిపారు. శిక్షణ కాలానికి ఉపాధి హామీలో చెల్లించే రోజువారీ కనీస వేతనం రూ. 237/- ప్రతిరోజూ చెల్లిస్తారని తెలి పారు. మహిళలు దీనిని సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీడీవో శేషగిరి శర్మ, ఏపీడీ సరళ, ఏపీవో ఉష, ఏపీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో శేషగిరి శర్మ తదితరులు పాల్గొన్నారు.