Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కురుమయ్య
నవతెలంగాణ-ఆమనగల్
ఈ నెల 28, 29 తేదీలలో రెండురోజుల పాటు నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య అన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులతో కలిసి సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులకు కాలరాసే కుట్రలో భాగంగా 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లను మార్చిందని ఆరోపించారు. జాతీయ సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేట్లకు విక్రయి స్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో సంక్షోభంతో కార్మికులు, సామా న్యుల బతుకులు దుర్భరంగా మారుతుంటే డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పేంచి అధిక భారం వేస్తుందని వాపోయారు. ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా రెండు రోజులు నిర్వహిస్తున్న సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం సమ్మె నోటీసును మున్సిపా లిటీ అధికారులకు అందజేశారు. సీఐటీయూ కన్వీనర్ లాలూనాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పిప్పళ్ళ శివశంకర్, కార్మికులు చిట్టిబాబు, హంసమ్మ, రా ములు, సుగుణమ్మ, బాలమణి, లక్ష్మమ్మ, అనసూయ, మైసమ్మ, సాలమ్మ, విజయ, జంగమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.