Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుంతలమయంతో వాహనదారులకు ఇబ్బందులు
- చెలరేగుతున్న దుమ్ము, ధూళీ
- రోడ్డు కోసం ఏడేండ్లుగా ఎదురు చూపు
నవతెలంగాణ-తాండూరు రూరల్
తాండూరు నుంచి కరణ్కోటా, గౌతాపూర్ చెక్ పోస్ట్ నుంచి సుమారు 8 కిలో మీటర్ల మేర రోడ్డంతా గుంతలమయంగా మారింది. బెల్కటూరు వాగుపైన వంతెన లేకపోవడంతో బెల్కటూరు, చంద్ర వంశ చిట్టి ఘనపూర్, కరణ్ కోట, ఓగిపూర్ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుపై అత్యధికంగా సిమెంట్ లారీలు, నాపరాతి గనుల్లోకి వెళ్లే లారీలు తిరగడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అ వుతోంది. లారీలు వెళ్లే దుమ్మూ, ధూళీ వ్యాపిస్తోంది. దీంతో వెనుక వచ్చే వాహనాలకు రోడ్డు కనిపించడం లేదు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.
గౌతాపూర్ నుంచి కరణ్ కోట 10 నిమిషాల్లో వెళ్లాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం 10 కిలో మీటర్ల మేర వెళ్లేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. గతంలో గౌతాపూర్ నుంచి గోపన్‌పల్లి వరకు మరమ్మతులు చేశారు. నిత్యం లోడు వాహ నాలు తిరగడంతో రోడ్డు అంతా గుంతలమయంగా మారింది. ఈ రోడ్డు డబుల్ రోడ్డు వేయాలంటూ కో రుతున్న ప్రజల కల కలగానే మిగిలింది. నాయకులు రోడ్డు మంజూరు అయిందని చెబుతున్నప్పటికీ ఆ మాటలు కాగితాలకే పరిమితం అయింది.
ఆరు నెలల నుంచి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో బస్సులు రావడం లేదు. దీంతో విద్యార్థులు, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గతంలో ధర్నా కూడా చేశారు. దీంతో వెంటనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కానీ నేటికీ పనులు ప్రారంభిం చలేదు. తాండూరుకు వచ్చే ద్విచక్ర వాహనదారులు ఏమీ చేయలేక బెల్కటూరు రైల్వే ట్రాక్ నుంచి ఎల్మాకన్నా మీదుగా తాండూరు వెళ్తున్నారు. ఇప్ప టికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఏడేండ్లుగా విన్నవిస్తున్నాం
కరణ్‌కోట నుంచి గౌతా పూర్ చెక్‌పోస్టు వరకు రోడ్డు గుంతలమయం అయింది. రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ప్రజాప్రతి నిధులకు, అధికారులకు విన్నవించాం. నిరసనలు కూడా తెలిపాం. కానీ వారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రవాణాదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి.
- బోయ అశోక్‌కుమార్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి.