Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి
ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ను కోరిన కొడంగల్
నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు
నవతెలంగాణ- కొడంగల్
కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ముదిరాజుల భవన నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కొడంగల్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ను కోరారు. సోమవారం ఎమ్మెల్సీనిమర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూల మాలతో సన్మానించారు. కొడంగల్ పట్టణంలో ముదిరాజులకు స్థలం కేటా యించడంతో భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ నిధులు కేటాయిం చాలని కోరారు. ఎమ్మెల్సీ బండ ప్రకాష్ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్టు ముదిరాజ్ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు నరసింహులు, భీమశంకర్, మల్లయ్య ముదిరాజ్, బాల్‌రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కులవృత్తిని ప్రోత్సహిస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణముదిరాజ్, గోపాల్ముదిరాజ్, జనార్ధన్, రాములు, తదితరులు పాల్గొన్నారు.