Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 3.33 లక్షలతో పనులకు శ్రీకారం
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
బండ్లగూడ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కమిషనర్ సమక్షంలో పలు వార్డుల్లో అభివృద్ధికి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.3 కోట్ల 35 లక్షల వరకు నిధులతో పలు వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రయినేజీ ఇతర పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. రాబోయో రోజుల్లో రాజేంద్రనగర్‌లోని మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు గోకరి సురేష్‌గౌడ్, కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, రవీందర్‌రెడ్డి, పద్మావతిపాప్యయాదవ్, ప్రశాంత్‌నాయక్, మాలతినాగరాజు, సాగర్ , కో-ఆప్షన్ సభ్యులు మాలకీరత్నం, వేంకట్రెడ్డి, సంతోషిరాజీరెడ్డి, సింగిల్ విండో ఛైర్మెన్ రాందాస్, డిప్యూటీ ఇంజనీర్ యాదయ్య, డిఇ శారాధ, ఎఇ రాజీవ్‌రెడ్డి, నాయకులు ఖాజా, రాజక్బారు, గోపాల్, డైరెక్టర్లు, మహిళలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.