Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ , మాధపూర్ డివిజన్లలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, కళాశాలకు ఎలాంటి అనుమతి లేకుండా, అధిక ఫీజులు వసూలు చేస్తూ, వేసవి సెలవులలో అడ్మిషన్స్ తీసుకోవడం మరియు వివిధ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పవన్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కళాశాల హెచ్.ఆర్ కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థిని, విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా మరోసారి ప్రవర్తిస్తే బీజేవైఎం అధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాధపూర్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ రాధాకష్ణ యాదవ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, జిల్లా కార్యదర్శి సురేష్, కుమార్ సాగర్, పిల్లి సాయి, రాహుల్, జిల్లా కార్యాలయ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ అమర్నాథ్ యాదవ్, జిల్ల కాలేజ్ ఔట్ రీచ్ సెల్ కన్వీనర్ జై సాయి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల సందీప్ , మదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆనంద్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చరణ్ యాదవ్, సామ్రాట్ గౌడ్, సాయి సుకుమార్ పటేల్ , శివ యాదవ్ , డివిజన్ ఉపాధ్యక్షులు అచ్యుత్ రెడ్డి , రాఘవేంద్ర, బీజేవైఎం నాయకులు శ్రీధర్ , మంజు , హర్షిత్, ధరణి, వెంకటేష్, సాయి, రాజు, కెవిన్ తదితరులు పాల్గొన్నారు.