Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ నిఖిల
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సోమవారం ఫారెస్ట్ నర్సరీలో జిల్లా కలెక్టర్ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ శాఖ ద్వారా నిర్వహించే నర్సరీలలో నాణ్యమైన పెద్ద సైజు మొక్కలు పెంచి రాబోయే హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్‌కు అవసరమైన మొక్కలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటామని, ఆ మొక్కలకు నీరు పోసి సంరక్షించాల్సిన అవస రముందని అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం (17) నర్సరీల ద్వారా (08) లక్షల మొక్కలు పెంచామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మంజుల రమేష్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా ఫారెస్ట్ అధికారి వేణుమాధవ్, డీపీవో మల్లారెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరుణ, మున్సిపల్ కౌన్సిలర్లు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.