Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శేరిలింగంపల్లి
ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నీటి ప్రాముఖ్యత, ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులను కలుషితం కాకుండా పొదుపుగా వాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన గోడ పత్రికను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ యస్ రాజశేఖర్ ముఖ్యాతిథిగా హాజరై ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వ జీవకోటి మనుగడకు గాలి, నీరు అత్యవసరమైన ప్రకృతి వనరని అన్నారు. ఇతర గ్రహాలకు భిన్నంగా, భూగోళం పై సర్వజీవకోటి వృద్ధి చెందడానికి నీరే ప్రధాన కారణమని, ప్రస్తుతం నీటి వనరులు తగ్గిపోయి, క్షీణిస్తున్న ప్రకృతి సంపదలో నీరు చేరిపోయిందని తెలిపారు. భూగోళం మీద ఉన్న నీటి వనరుల్లో 99 శాతం ఉప్పు నీరే, ఇందులో 97 శాతం సముద్రాలలో ఉండగా మిగతావి నదులు, చెరువుల్లో ఉన్నాయని, తాగడానికి ఉపయోగపడే జలాలు 1శాతం మాత్రమేనని ఇందులో 0.86 శాతం చెరువులు, 0.02 శాతం నదుల్లో, మిగిలిన 0.12 శాతం భూగర్భ జలాలు, ప్రపంచ వ్యాప్తంగా 0.3 శాతం నీరు ఉపయోగపడుతుందన్నారు. వనరులే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 786 కోట్ల జనాభాకు దాహాన్ని ఇతర అవసరాలను తీరుస్తోందన్నారు. భూగర్భ నీటి మట్టం పెరగడానికి, చెక్ డ్యామ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ నీటి మట్టం పెంచాలని, వర్షపు నీటిని చుక్కా చుక్కా ఒడిసి పట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో బీవీ రమణగౌడ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, శివ రామకృష్ణ, పాలం శ్రీను, జనార్థన్, నాగేశ్వరావు, అశోక్, బాలన్న పాల్గొన్నారు.