Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగాపూర్ సర్పంచ్ డబ్బికార్ మమత అజరు బాస్
నవతెలంగాణ- మంచాల
ముత్తుట్ వారి సౌజన్యంతో గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకొవాలని సర్పంచ్ డబ్బికార్ మమత అజరు బాస్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రంగాపూర్‌లో వారు మాట్లా డుతూ.. ముత్తుట్వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో సుమారు 100 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారని, బీపీ, షుగర్, కోలాష్ట్రాల్ మొదలుగు పరీక్షలు చేశారని అన్నారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారు డాక్టర్ సలహాలు పాటిస్తు ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకొవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుకుడాల జంగారెడ్డి, పంచాయతి కార్యదర్శి మల్లిక, కారోబార్ మేడిపల్లి అంజయ్య, గ్రామస్తులు డబ్బికార్ అజరు బాస్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.