Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 రోజులపాటు ఉచిత శిక్షణ
- మహిళలకు రోజువారి వేతనం
- ఎంపీపీ కొప్పు సుకన్య భాష
నవతెలంగాణ-యాచారం
మహిళలు గిల్టీ నగల తయారీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కొప్పు సుకన్య భాష కోరారు. సోమవారం మండల పరిధిలోని మేడిపల్లిలో డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పని పూర్తి చేసుకున్న 40 ఏండ్ల లోపు మహిళలందరికీ ఆర్టిఫిషియల్ జువెలరీపై ఉచిత శిక్షణపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. శిక్షణను 13 రోజు లపాటు అందించి మహిళలందరికీ ఉపాధి కల్పించడమే దీని లక్షమన్నారు. శిక్షణతో పాటు రోజువారి వేతనం అందజేస్తారని, ఈ సదవకాశాన్ని మహిళలందరూ సద్విని యోగం చేసుకోవాలని ఎంపీపీ పేర్కొన్నారు. కార్యక్ర మంలో డీఆర్డీఎస్డీపీఎం బాలరాజు, ఎంపీడీవో విజ యలక్ష్మి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఓ లింగయ్య, ఏపీ ఎం సతీష్, ఉపసర్పంచి ఆలంపల్లి సత్తమ్మ, ఎంపీటీసీ మోరుగు శివలీల, డైరెక్టర్ సరూప, సీసీలు గణేష్, రాజు, ఉపాధి హామీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.