Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్లోని గచ్చిబౌలి చెందిన హిందువులు, ముస్లింలు మమేకంగా గ్యార్మీ పండుగ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ముస్లిం మాసాల ప్రకారం రబ్బీసాని మాసంలో గచ్చిబౌలి గ్రామంలో మైసుభాని దర్గ వద్ద గ్యార్మీ పండుగ జరుపుకుంటారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒకరి ఇంటి వద్ద నుంచి సందల్ ఊరేగింపుతో దర్గా వద్దకు చేరుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి జెండా దర్గా వద్దకు తీసుకువచ్చి దర్గా వద్ద నిలుపుతారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మత విభేదాలు లేకుండా ప్రతి ఏటా గ్యార్మీ పండు గను జరుపుకోవాలని కోరారు. అనంతరం దర్గా వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి మైనారిటీ ప్రెసిడెంట్ నాయీమ్, గడ్డరాజు, నందుసింగ్, మహమూద్ భారు, అజ్జుభారు, టీంకు, విట్ఠలచారి, అబ్దుల్ సత్తార్, ముకేశ్ సింగ్, సదానంద్, సలీం, అబ్దుల్ రహీం, రవి కిరణ్, రంజిత్ సాగర్, సాయి, జమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.