Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
మండల పరిషత్ ద్వారా మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని లక్ష్మారెడ్డిగూడ గ్రామంలో రూ. 6 లక్షల నిధులతో అండర్ డ్రయినేజీ పనులను జీడ్పీటీసీ గోవిందమ్మగోపాల్‌రెడ్డి, సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ నిధుల ద్వారా గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భుజంగంరెడ్డి, ఉపసర్, వార్డు సభ్యులు శ్రీనివాస్ గౌడ్, భాగ్యమ్మ చంద్రయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విట్టల్ రెడ్డి, గ్రామ పెద్దలు దండు వెంకటేశం, శ్రీనివాస్ రెడ్డి, దండు శ్రీనివాస్, మల్లేశం, విట్టల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, లక్ష్మయ్య, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.