Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ
- సమర్ధవంతంగా విధులు నిర్వహించిన సీఐ జలంధర్ రెడ్డికి అభినందనలు
- బాధ్యతలు చేపట్టిన సీఐ రాజేందర్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు రూరల్
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనసరి అన్ని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం తాండూరు మండలం గౌతాపూర్ పరిధిలోని భవానీ ఫంక్షన్హాల్లో తాండూరు రూర ల్ సీఐ జలంధర్ రెడ్డి వీడ్కోలు సమావేశం కరణ ్కోట ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వ హించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరై, మాట్లాడుతూ ఉద్యోగులకు స్థాన చలనం పదోన్నతి సహజమన్నారు. 32 నెలలుగా తాండూరు రూరల్ సీఐగా జలేందర్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో సమర్ధవంతంగా విధులు నిర్వ హించారని అభినందించారు. ప్రస్తుతం బదిలీపై సంగారెడ్డి డీసీఆర్బీకి వెళ్లినట్టు తెలిపారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సీఐ రాంబాబు, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాంసుందర్ రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, తాండూరు జడ్పీటీసీ మంజుల వెంకటేశం, పెద ే్దముల్ జడ్పీటీసీ దరాసింగ్, బషీరాబాద్ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, కేరళలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయీం, వికా రాబాద్ జిల్లా కోఆప్షన్ సంఘం ఉపాధ్యక్షుడు షంషోద్దీన్, టీఆర్ఎస్ నాయకులు పటేల్ ఉమా శంకర్, రైతు సమన్వయ సమితి మండల కో- ఆర్డినేటర్ రామలింగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్య క్షులు రాందాస్, తాండూరు నియోజక వర్గంలోని యాలాల బషీరాబాద్ పెద్దేముల్ తాండూరు మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.