Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశమోళ్ల అంజనేయులు
నవతెలంగాణ-షాబాద్
దళితులకు మూడేకరాల సాగు భూమి ఇస్తానని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉన్న భూములను లాక్కుంటూ వారిని రోడ్డున పడేస్తు న్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశమోళ్ల అంజనేయులు ఆరోపించారు. సోమవారం ఆయన రైతులతో కలిసి షాబాద్లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని షాబాద్ రెవె న్యూలో ఉన్న సర్వే నెంబర్ 911లో ఉన్న 296 ఎకరాల ప్రభుత్వ భూమిలో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేదల భూములను ప్రభుత్వం తీసుకోవడానికి సన్నాహాలు చేస్తుందన్నారు. ఒకవేళ ఈభూమి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదా ఆ భూమికి ఎకరం కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఇప్పటికే మండల మాచన్ప ల్లిలో నిరుపేదల ప్రభుత్వ భూములు లాక్కొని వారిని ఎటుకాకుండా చేసిం దని ఆవేదన వ్యక్తం చేశారు. చంద న్వెళ్లిలో రైతుల నుంచి నిర్ధాక్ష్య ణియంగా లాక్కున్నట్టు తెలిపారు. షాబాద్ రెవెన్యూ పరిధిలో లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.