Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్
- చిగుళ్లపల్లి మంజుల రమేష్
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
అడవులను సంరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యతని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సోమవారం వికారా బాద్ జిల్లా అటవీ శాఖ జిల్లా అధికారి వేణుమాధవ్ ఆధ్వర్యంలో అనంతగిరి ఫారెస్ట్ నర్సరీలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నిఖిలతో కలిసి చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పాల్గొన్నారు. కలెక్టర్ నిఖిలతో చైర్ పర్సన్ మంజుల రమేష్ మొక్కను నాటారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం, ప్రకృతిని కాపాడడం, అడవులను సంరక్షించడం అందరి బాధ్యత అన్నారు. వేసవి కాలంలో ఎండ దెబ్బకు అడవుల్లో మంటలు మండి అగ్ని ప్రమా దాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కాబట్టి అనంతగిరి అటవీలో ఇలాంటి అగ్ని ప్రమా దాలు ఏవైనా జరిగితే, ప్రతి ఒకరు బాధ్యతగా స్పందించి ఫారెస్ట్ అధికారులకు లేదా 101 అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించి అనంతగిరి ఫారెస్ట్ సంరక్షణకు సహకరించాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్డిఓ కృష్ణన్, డీపీిఓ మల్లారెడ్డి, ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి వరప్రసాద్, ఎంపీడీవో సత్తయ్య, స్థానిక కౌన్సిలర్ కృష్ణ, కౌన్సిలర్లు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, స్థానిక నాయకులు దీపు, హసీబ్, ఫారెస్ట్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.