Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 ఏండ్ల కింద ఇంటి నిర్మాణాలకు జాగలిచ్చిన ప్రభుత్వం
- డబ్బులు లేక నిర్మాణాలు మధ్యలో నిలిపివేత
- జాగల నుంచి బాధితులను వెళ్లగొట్టే కుట్ర
- మా జాగలు వదులుకోబోం
- కలెక్టర్ సారే.. మాకు సాయం చేయాలి
- కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆందోళన
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో భూముల ధరలు రెట్టింపు స్థాయిలో పెరుగడంతో రియల్ వ్యాపారులు, అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు.. ప్రశ్నించలేని పేదల భూములపై కన్నెసి కాజేస్తున్నారు. భూ అక్రమాల్లో అధికార పార్టీ నాయకులు పాత్ర ఉండటంతో రెవెన్యూ అధికారులు సైతం చూసి చూడనట్టు వదిలివేడయంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. తమ భూములు కబ్జాలకు గురైన వని వందలాది మంది బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. అధికారులు, అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేయకుండా బాధితులకు న్యా యం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఫత్తేపురంలో ఎస్సీ సామాజిక తరగతులకు ఇండ్ల నిర్మాణం కోసం 1950లో ఆనాటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారుల సమక్షంలో సర్వే నెంబర్లో 221/3లో దాదాపు రెండెకరాల పరిధిలో సుమారు 60 మందికి 120 గజాల జాగా కేటాయించింది. అందులో కొంత మంది ఇం డ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కొంత మంది అక్కడ ఇంటి నిర్మాణం కోసం బేస్మెట్ వరకు నిర్మాణాలు చేపట్టి ఆర్థిక పరిస్థితిలో మధ్యలో నిలిపివేశారు. మిగతా ఖాళీ స్థలంపై ఓ రియల్ వ్యాపారి కన్నెసి.. తప్పుడు పత్రాలు సృష్టించారు. ఆ భూములను వాళ్లే కొనగోలు చేసినట్టు బాధితులను బెదిరించారు. దీంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితిలో మున్సిపల్ కమిషనర్‌ను కలిశారు. తన ఏమీ తేలియదని ఆయన చేతులెత్తేశారు. తమ ఇంటి జాగను కాపాడేది ఎవరిని బాధితులు ఆందోళన బాట పట్టా రు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. 'మా దళితుల భూములపై కన్నెసిన రియల్ వ్యాపా రులపై చర్యలు తీసుకుని మా జాగలు మాకు అప్పగించాలి' అని ఆవేదన వ్యక్తం చేశారు. కూలినాలి చేసుకుని బతికే తమకు ప్రస్తుతం భూములకు ఉన్న ధరలతో ఇంటి జాగలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములను కాపాడుకోవడమే తమ ముందున్న లక్ష్యం అని, ఆ స్థలంలోనే గుడిసెలు వేసుకుని ఉంటామని స్పష్టం చేశారు. తమకు కలెక్టర్ అండగా ఉండాలని కోరారు.
మా జాగలు మాకు ఇవ్వాలి
కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మా ఇంటి జాగలపై వ్యాపారులు కన్నెశారు. ప్లాట్ అద్దురాళ్లు సైతం లేకుండా డోజర్ బండ్లతో లెవల్ చేసిండ్రు. మా జాగలో ఎందుకు చదును చేస్తున్నా రని అడ్డుపడితే కేసులు పెట్టినండ్రు. అధికారుల దగ్గరకు పోయి అడిగితే ఏమీ సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వం ఆ నాడు ఇచ్చిన జాగ పత్రాలు సూత ఉన్నాయి. కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. నాకు 221/3 సర్వేనెంబర్లో ప్లాట్ నెంబర్ 35 కేటాయించినట్టు గ్రామ పంచాయతీ ధ్రువీకరణ పత్రాం కూడా ఇచ్చింది. ఇప్పుడు అది చెల్లదంటుండ్రు. ఏమీ చేయాలో దిక్కుతోచడం లేదు. కలెక్టర్ సారును కలుద్దామని వచ్చినాం. కానీ సార్ మా గోడు వినకుండానే వెళ్లిపోయిం డు. ఇక మా గోడు పట్టించుకునేదెవరు. ఇప్పటికైనా మా జీవన పరిస్థితులను చూసి.. మాకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నాం.
- శ్రీనివాస్, బాధితుడు, ఫత్తేపురం
సచ్చిన జాగ వదులం
గీ పెద్దోలకు మా పేదల భూము లే కావాల్సి వచ్చిందా.. తిండి తిప్పలు లేక కాయ కష్టం చేసుకుని బతుకుతున్న మా నోటికాడి బుక్కె ఎట్లా లాక్కొబుద్ది అవు తుంది. మాకు ఉండటానికి ఇల్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటున్నాం. ఇండ్లు నిర్మించుకునేం దుకు డబ్బులు లేక.. స్థలాలు ఖాళీగా వదిలేస్తే కబ్జా పెట్టడం న్యాయం కాదు. ప్రాణం పోయినా సరే జాగ ఇచ్చేది లేదు.
- సత్తమ్మ, బాధితురాలు