Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత్ భారత్ అభియాన్ కో-ఆర్డినేటర్ గూడూరు నవనీత రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
గ్రామాల అభివృద్ధిలో స్థానిక యువత పాత్ర కీలకమైందని ఉన్నత్ భారత్ అభియాన్ కో- ఆర్డినేటర్ గూడూరు నవనీతరెడ్డి అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నత్ భారత్ అభియాన్‌లో భాగంగా కో-ఆర్డినేటర్ గూడూరు నవనీతరెడ్డి మంగళవారం కడ్తాల్ మండలం లోని అనుమాస్పల్లి గ్రామంలో సర్పంచ్ శంకర్ తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హైదరా బాద్‌లోని భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి మండలంలోని అనుమాస్పల్లి, మక్తమాధారం గ్రామాలను దత్తత తీసుకుని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా అక్షరాస్యత పెంపు, పారిశుధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల ఏర్పాటు, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తామని అన్నారు. అందుకోసం ఏప్రిల్ మొదటి వారంలో కళాశాల విద్యార్థులతో గ్రామంలో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హరీష్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.