Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్తు తరాలను వనరులను కాపాడుకుందాం
- మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నవతెలంగాణ-మియాపూర్
ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి, నేటి భవిష్యత్ తరాలకు అందింద్దామని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు.నేడు ప్రపంచ జల దినోత్సవం సంధర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో జలమండలి అదికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జలమండలి అధికారులు, స్థానికులతో కలసి పాల్గొన్న మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ భూమిపై ఉన్న నీటిలో 97 శాతం తాగడానికి పనికి రాని నీరు ఉంటే మిగతా రెండు శాతం మంచు పర్వతాలలో గడ్డ కట్టుకుని ఉంది ఇక మిగిలిన ఒక్క శాతం నీటిని మాత్రమే ప్రజలు వాడుకోవడానికి అనువుగా భూగర్భంలో దాగి ఉన్నాయని ఈ ఒక్కశాతం బుగర్భజలాలో ప్రపంచ వ్యాప్తంగా సగం తాగునీటి అవసరాలకు పోతే నాలబై శాతం నీళ్లు వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు పోగా భూగర్భంలో నీరు ఉండడంలేదన్నారు. దాదాపు అన్ని దేశాలలో భూగర్భ జలాలు ఇంకిపోయే దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదశ్యమవుతున్న భూగర్భ జలాలను రక్షించుకోవాలని కోరారు. ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని, నీటిని పొదుపు చేసుకునేలా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో, జై శంకర్, జలమండలి అధికారులు డీజీఎం, నగప్రియ, మేనేజర్లు సాయి చరిత, సునీత, వర్క్ ఇన్స్పెక్టర్లు జె రమేష్, కిష్టప్ప, జలమండలి సిబ్బంది, కాలనీ అధ్యక్షులు అన్నిరాజు, రమంజనేయ రెడ్డి, రాఘవరావు, అశోక్, రవి, వెంకట్ రెడ్డి, కృష్ణమూర్తి, సీతకుమారి, అనిత, తదితరులు పాల్గొన్నారు.