Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నిరుద్యోగ యువత, విద్యార్థులకు త్వరలోనే వచ్చే నోటిఫికేషన్ల కోసం ఉచిత కోచింగ్ కోసం భారీ ఎత్తున్న స్పందన రావడం సంతోషకరమని రాష్ట్ర యువనేత, ఎంకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) అన్నారు. ఈ నెల 25 వరకు దరఖాస్తు గడవు పొడిగించినట్టు ఫౌండేషన్ కార్యదర్శి జెర్కొని రాజు , నిట్టూ జగదీశ్వర్ తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, విజరు రజక, బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు పి మహేష్ మహరాజ్, దేవరకొండ మహేష్, చీర వంశీ, జంగిలి శంకర్, నరేష్, ఫౌండేషన్ సభ్యులు శ్రవణ్, సతీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.