Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్య్సకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
చెరువులు, కుంటలపై వేస్తున్న అధిక లీజులను రద్దు చేయాలని మత్య్సకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి 2022-23 సంవత్సర బడ్జెట్ లో కేవలం రూ.187కోట్లు మాత్రమే కేటాయించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మత్స్య సొసైటీలకు చేప పిల్లలు, రొయ్య పిల్లల ఇవ్వడం వల్ల పెద్ద ఎత్తున మత్స్య సంపద 5 లక్షల టన్నులు పెరిగిందని గొప్పలు చెప్పుకోవడమే తప్ప చేసేదేమీలేదన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల మత్స్యసంపద రోజు రోజుకు తగ్గిపోతుందని చెప్పారు. మత్స్యకారులను అభివృద్ధి చేయాలని కోరారు. వేంటనే లీజులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా మాట్లాడుతూ.. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులు, కుంటలను అక్రమంగా కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్ని సార్లు ఇరిగేషన్, తహసీల్దార్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల స్థితిగతులపై అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. మండల, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్లోనీ ఇన్సూరెన్స్ మంజూరు చేయాలన్నారు. 50 ఏండ్లు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులగాజుల జంగయ్య, సీహెచ్ వెంకన్న, సోసైటీల అధ్యక్షులు అన్నెపు చంద్రయ్య, బోళ్ల నర్సింహ్మా, తవిటి యాదగిరి, నాయకులు అన్నెపు వెంకటేష్, చనమోని గోపాల్, గుడ్డిమల్లి గీరి ప్రసాద్, జీలమోని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.