Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రాంతీయాధికారి డాక్టర్ శారాధావేంకటేష్
నవతెలంగాణ-గండిపేట్
రాష్ట్ర గురుకుల సంఘీక సంక్షేమ విద్యాలయా సంస్థ 2022-23 విద్య సంవత్సరానికి ఐదవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ ప్రాంతీయాధికారి డాక్టర్ శారాదా వేంకటేష్ అన్నారు. మంగళవారం ఆమె షేక్‌పేట్‌లోని ప్రాంతీయా కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దరఖాస్తుకు ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులై ఉండాలన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులు ఆర్హులన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో వంద రూపాయాలను రుసుము చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 28 వరకు చివరి తేది అన్నారు. పట్టణ ప్రాంతాలల్లో 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి 1,5 లక్షల ఆదాయం ఉండాలన్నారు. విద్యార్థుల ఫోటో, సంతకం, సెల్ నంబరు, ఆధార్ నంబర్ , పుట్టిన తేది తప్పని సరిగా ఉండాలన్నారు. ప్రవేశ పరీక్ష మే 5న ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం అందుబాటులో ఉన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.