Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పరిగి
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏఐసీపీి అధ్యక్షులు సోనియా గాంధీ, టీపీపీసీి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆదేశాలతో చేస్తున్నటువంటి కాంగ్రె స్ డిజిటల్ మెంబెర్షిప్లో భాగంగా పరిగిలోని ప్రతిబూత్కూ 300- 500 పైగా సభ్యత్వ నమోద్లు చేయించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన బూత్ ఎంరోలకు రామ్మోహన్ రెడ్డి పోత్సాహ కాలు అందజేస్తూ సన్మానించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేప్ప ట్టిన డిజిటల్ మెంబెర్షిప్ కార్యకర్తల బలంతో నియోజకవర్గంలో 45 వేల సభ్యత్వ నమోదైం దని అన్నారు.పార్టీ ప్రతి బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ బలంగా ఉందని సభ్యత్వ నమోదు ద్వారా తెలిసిందన్నారు. ఈ నెల 28 వరకు సభ్యత్వ నమోదుకు అవకాశము న్నందున కింది స్థాయి వరకు సభ్యత్వ థనమోదు చేసేలా నాయ కులు, కార్యకర్తలు, ఎంరోలర్లు కృషి చేయాల న్నారు. కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు పార్థ సారథి పంతులు, భరత్‌కుమార్, జిల్లా ఉపాధ్య క్షులు లాలకృష్ణ, అశోక్, ప్రధాన కార్య దర్శి హను మంతు ముదిరాజ్, మండల అధ్యక్షులు పరుషు రామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కృష్ణ, పుడూర్, దోమ, కుల్కచెర్ల, మోహమ్మ దబాద్ మండలాల అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్, విజరు కుమార్ రెడ్డి, ఆంజనేయులు, నారాయణ, కార్య దర్శి రామచంద్రయ్య, చిన్న నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, కౌన్సిలర్ మల్లేష్, శివకు మార్, ఆనంద్, జగన్, వెంకట్, గోపాల్, రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.