Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దేముల్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన నూతన సీఐ రాంబాబు
నవతెలంగాణ- వికారాబాద్ డెస్క్
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తాండూరు రూరల్ సీఐ రాంబాబు తెలిపారు. మంగళవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించారు. తాండూరు రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులకు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధుల గురించి. సమస్యల గురించి ఎస్ఐ నాగరాజు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు.