Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చేవెళ్ల
చేవెళ్ల తైబజార్ ఎప్పుడూ లేనంత ధర పలికింది. ప్రతి గురువారం జరిగే సంతలో వ్యాపారుల నుంచి నిర్దేశించిన రుసుములు వసూలు చేసేందుకు మంగళవారం పంచాయతీ కార్యాలయంలో తైబజార్ బహిరంగ వేలం నిర్వహించారు.
ఈ బహిరంగ వేలంలో ముగ్గురు వ్యక్తులు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. అత్యధికంగా వెంకటస్వామి గౌడ్ రూ.6 40 లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. ఎంపీఓ విఠలేశ్వర్, సర్పంచ్ బండారి శైలజ, ఉప సర్పంచి యాదయ్య, గ్రామ కార్యదర్శి, వెంకట్ రెడ్డి సమక్షంలో ఈ వేలం నిర్వహించారు. గతేడాది తైబజార్ రూ. 5.68లక్షలు ధర పలకగా ఈసారి అంతకంటే ఎక్కువ వేలం పాడటం గమనార్హం.